నర రూప రాక్షసులైన పోలీసులు

నర రూప రాక్షసులైన పోలీసులు

భోపాల్ : ఇండోర్ పట్టణంలో మాస్క్ పెట్టుకోకుండా బయటికి వచ్చిన ఆటో డ్రైవర్ కృష్ణ కేయర్(35)ను ఇటీవల నడిరోడ్డుపై పోలీసులు చితకబాదటం సామాజిక మాధ్య మాల్లో సంచలనమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన తండ్రిని కలవడానికి ఆటోలో బయలు దేరిన కృష్ణ పెట్టుకున్న మాస్కు కాస్త ముక్కు కిందకు జారింది. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు కృష్ణను ఆపి పోలీస్ స్టేషన్కు రావాలని డిమాండ్ చేశారు. ందుకు నిరాకరించడంతో పోలీసులు కృష్ణ ను నడి రోడ్డుపై కింద పడేసి కనికరం లేకుండా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ కాళ్లతో తన్నారు. తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించినపుడు ఇంకా రెచ్చిపోయారు. ఆటోడ్రైవర్పై అతనితో వచ్చిన కొడుకు కూడా తమకు సాయం చేయాలని అక్కడి వాళ్లను కోరినా.. చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారేగానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ  ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీశాడు. దాడి చేసిన పోలీసులను కమల్ ప్రజాపథ్, ధర్మేంద్ర జట్గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వారిద్దరిని సస్పెండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos