మారింది రేంజే విధ్వంసం కాదు..

మారింది రేంజే విధ్వంసం కాదు..

భారత్ రక్షణ పరిశోధన రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది. భారత రక్షణశాఖ అమ్ములపొదిలో `బ్రహ్మోస్` క్షిపణి ఓ బ్రహ్మాస్త్రం వంటిదన్న సంగతి తెలిసిందే. శత్రుసేనలను క్షణాల్లో మట్టుపెట్టగల బ్రహ్మోస్…భారత్ సైన్యానికి మరింత బలం చేకూర్చింది. తాజాగా సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను విజయవంతగా ప్రయోగించామని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చేపట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. తాజాగా జరిపిన పరీక్షలో మిసైల్ రేంజ్ని మార్చామని రేంజ్ మారినా మిసైల్ ను విజయవంతంగా పరీక్షించామని తెలిపారు. ఆధునీకరించిన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగలదని డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఒడిశా నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని డీఆర్డీవో ఛైర్మెన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి అభినందించారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ భారత సైన్యం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం వంటిదని మన సైనికులకు ఇది అదనపు బలం అవుతుందని అన్నారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి సబ్ మెరైన్ల నుంచి యుద్ధ నౌకల నుంచి ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్ ప్రైజ్ ఎన్పీవో మషినోస్ట్రోనియల (ఎన్పీవోఎం)తో కలిసి డీఆర్డీఓలు`బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్`అనే సంస్థను సంయుక్తంగా ఏర్పాటు చేసి భారత్లో ఈ క్షిపణిని తయారు చేశాయి. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికత ఆధారంగా ఈ క్షిపణిని తయారుచేశారు. భారత్ లోని బ్రహ్మపుత్ర నది రష్యా లోని మోస్క్వా నది లను కలిపి హిందూ పురాణాల్లోని `బ్రహ్మాస్త్రం` పేరు ధ్వనించేలా ఈ క్షిపణికి `బ్రహ్మోస్` అని నామకరణం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసక క్షిపణు లన్నిటిలో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos