నియంతృత్వం దిశగా భారత్‌

నియంతృత్వం దిశగా భారత్‌

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ది ఇండిపెండెంట్, ది వీక్, యూకే గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్బర్గ్, రాయిటర్స్, ఫైనాన్సియల్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు వివిధ కోణాల్లో కథనాల ద్వారా భారత్లోని పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆ దేశానికి చెందిన పత్రిక ‘హారెట్జ్’ తాజాగా ఓ కథనం ఇచ్చింది. ప్రధాని మోదీ హయాంలో భారత్ క్రూరమైన నియంతృత్వం దిశగా సాగుతున్నదని తీవ్ర విమర్శలు చేసింది.భారత్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి ఇటీవలి పలు మీడియా సంస్థల హెడ్లైన్స్ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా పనిచేసిన పంకజ్ పచౌరి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మోదీ పాలనలో భారత్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని, నియంతృత్వంలోకి జారుకుంటున్నదని ‘నిప్పాన్ జపాన్’ విమర్శించింది. విపక్షాలను, వ్యతిరేకతను అణచివేసేందుకు అధికార బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ది ఇండిపెండెంట్ పేర్కొన్నది. భారత్లో చట్టాలు ఏమయ్యాయంటూ ది అట్లాంటిక్ మ్యాగజైన్ కథనం ఇచ్చింది. మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం పౌర హక్కులపై దాడులను తీవ్రతరం చేసిందని యూకే గార్డియన్ విమర్శించింది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారతదేశంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ అభిప్రాయపడింది. మోదీ విధానాలను ప్రగతిశీల దక్షిణాది రాష్ర్టాలు తిరస్కరిస్తున్నాయని బ్లూమ్బర్గ్ ఓ కథనం ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos