భారత్, పాక్ మ్యాచుకు భలే గిరాకీ

భారత్, పాక్ మ్యాచుకు భలే గిరాకీ

ఇంగ్లండ్‌ లో మే ౩౦ నుంచి జరుగనున్న క్రికెట్ ప్రపంచ కప్పు పోటీల్లో పాక్ జట్టుతో భారత్‌ తలపడాలా, వద్దా అనే విషయమై జోరుగా చర్చలు సాగుతుండగా, ఆ ఇరు జట్ల మ్యాచ్ ను తిలకించడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. లీగ్ పోటీల్లో భాగంగా జూన్ 16న భారత్, పాక్ ఆడాల్సి ఉంది. మ్యాచ్ జరగాల్సిన స్టేడియం సామర్థ్యం 25 వేలు కాగా, నాలుగు లక్షల మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, గత ఛాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే పోటీకి కూడా ఇంతగా డిమాండ్ లేదు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ కు కూడా ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు రాలేదని ఐసీసీ తెలిపింది. కాగా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని భారత్ కూడా యోచిస్తున్నట్లు వార్తలు రాగా, సీనియర్ క్రికెటర్ల సూచనలతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ను బహిష్కరిస్తే పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు పడుతుంది. ప్రపంచ కప్పు మ్యాచుల్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియాపై గెలవలేదు. ఈ టోర్నీలో మ్యాచును బహిష్కరిస్తే మనమే పాకిస్తాన్ ను గెలిపించినవారమవుతామని సునీల్ గవాస్కర్, టెండూల్కర్లు హెచ్చరించారు. అలా కాకుండా పాకిస్తాన్ ను ఓడించి మన జైత్ర యాత్రను కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos