వలసదారులపై అమెరికా మరో బాంబు..

వలసదారులపై అమెరికా మరో బాంబు..

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల ప్రజల్లో గుబులు రేపుతున్నాయి.తాజాగా అటువంటి మరొక నిర్ణయమే ట్రంప్‌ సర్కార్‌ తీసుకుంది.కొన్నేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డ వలసదారులకు గ్రీన్‌కార్డులు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ట్రంప్‌ ప్రభుత్వం కొత్త బాంబు పేల్చింది.ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఫుడ్ స్టాంప్స్, వైద్యసేవలు, ఇతర ప్రజాపంపిణీ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందే వలసదారులకు గ్రీన్ కార్డు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. ఇక ట్రంప్ సర్కార్ నిర్ణయంతో కొన్ని లక్షల మంది వలసదారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో హిస్పానిక్ తదితర దేశాలకు చెందిన వలసదారులు తీవ్ర ప్రభావం ఎదురకోనున్నారు. చాలా తక్కువ వేతనంకు పనిచేస్తూ అమెరికా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా హిస్పానిక్ తదితర దేశాలకు చెందిన వలసదారులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోరుతూ అమెరికా దేశంలో చట్టబద్దంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలంటే అది చెల్లదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేయడంతో దేశం వెలుపల ఉన్న పేద మరియు తక్కువ నైపుణ్యం గల వలసదారుల ఆశలపై ట్రంప్ సర్కార్ నిర్ణయంతోనీళ్లు చల్లినట్లయ్యింది.ఇక ఇప్పటికే గ్రీన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్న వారిని గుర్తించి వారి గ్రీన్ కార్డు రద్దు చేస్తామని పేర్కొంది. అమెరికాలో స్థిరపడే వలసదారులు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉండాలని ట్రంప్ చెప్పినట్లుగా వైట్హౌజ్ ప్రకటన విడుదల చేసింది. ఇక చాలామంది వలసదారులు ఇప్పటికే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలితాలతో లబ్దిపొందారని ఇదిలానే కొనసాగితే అమెరికా పౌరులు అన్యాయానికి గురవుతారని వెల్లడించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos