అమెరికా అధికారుల పట్ల నిరసన

అమెరికా అధికారుల పట్ల నిరసన

శాన్ఫ్రాన్సికో: అమెరికా వలస అధికారులు అనుసరిస్తున్న మానవ హక్కులను ఉల్లంఘన తీరును వందలాది గూగుల్ ఉద్యోగులు నిరసించారు. ఇకపై ఆ అధికారులతో కలిసి పని చేయబోమని దాదాపు 600 మంది గూగుల్ ఉద్యోగులు తమ యాజమాన్యానికి విన్నవించారు. అమెరికా సుంకా లు, సరిహద్దు రక్షణ దళం,తో క్లౌడ్ కంప్యూటింగ్ సేవల ఒప్పందాల్ని చేసుకోరాదని కోరారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్లు క్లౌడ్ కంప్యూటింగ్ సేవ లను అందిస్తున్నాయి. ‘అందరూ కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. సీబీపీతో గూగుల్ చేసుకునే ఏ ఒప్పందానికి సంబంధించిన పనినీ మేము చేయబోం’ అని ఉద్యోగులు వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనికి ఇంకా గూగుల్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వలసల వ్యవహరాల్లో వల స, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఎలాంటి సహాయం లభించడం గూగుల్ ఉద్యోగులు ఆరోపించారు. ‘చరిత్ర స్పష్టంగా ఉంది. ఇది ఇలాంటివి కుదరదు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంద’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos