హార్లే డేవిడ్సన్‌ పై దిగుమతి సుంకం వద్దు

హార్లే డేవిడ్సన్‌ పై దిగుమతి సుంకం వద్దు

వాషింగ్టన్: భారత్లో హార్లే డేవిడ్సన్ మోటారు సైకిళ్ల ధరలో సగం సుంకాలే ఉన్నందున వాటి ధరను గణనీయంగా తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరోసారి డిమాండు చేసారు సుంకాన్ని వంద నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం యాభై శాతానికి తగ్గించింది. ఇదీ అంగీకారయోగ్యం కాదు. మొత్తం సుంకాన్ని రద్దు చేయాలని కోరారు. ఇది వరకే డొనాల్ట్‌ ట్రంప్, భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణించారు. సుంకాల విషయంలో అమెరికా దోపిడీకి గురవుతోందని ఆవేదన చెందారు. ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు 80,000 కోట్ల డాలర్ల మేర ఉందని వివరించారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28,29లలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా మోదీ,ట్రంప్లు భేటీ కానున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos