10 నిమిషాల్లో రూ.12 కోట్లు దోపిడీ

10 నిమిషాల్లో రూ.12 కోట్లు దోపిడీ

కటక్: వీళ్లు మామూలు దొంగలు కాదు. 10 నిమిషాల్లో రూ.12 కోట్లు విలువైన బంగారాన్ని దొంగలించారు. ఇప్పటి వరకూ ఒరిస్సాలో జరిగిన చోరీలతో పోలిస్తే ఇది కాస్త ప్రత్యేకంగా కనిపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం కటక్ పట్టణంలోని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్యాంక్ నయాసరక్ బ్రాంచ్లోకి గురువారం నలుగురు దొంగలు ముసగులు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. వారిలో ఒక దొంగ సెక్యూరిటీ గార్డ్ తలపై గన్పెట్టి బెదిరించాడు. మిగిలిన ముగ్గురు కలిసి బ్రాంచ్ మేనేజర్ను, మిగిలిన సిబ్బందిని చుట్టు ముట్టారు. లాకర్ తాళాలను లాక్కుని వాటిలోని మొత్తం బంగారాన్ని (సుమారు రూ.12కోట్లు విలువ చేసే)ఎత్తుకుని ఉడాయించారు. ‘కేవలం 10 నిమిషాల్లో అంతా జరిగిపోయింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద’ని బ్రాంచ్ మేనేజర్ సత్య ప్రదాన్ అన్నారు. దొంగలు బ్యాంకులోకి వచ్చే సమయానికి సిసిటీవీలు సక్రమంగా పని చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కంపెనీల వద్ద భద్రతా సిబ్బందిని పెంచుకోవాలని పోలీసులు సూచనలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos