మసాలా ఇడ్లీ

మసాలా ఇడ్లీ

తరచూ ఇడ్లీ అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసం ఇడ్లీతోనే ఇలా చేసి పెట్టి చూడండి.
కావల్సినవి: ఇడ్లీలు – ఐదారు, ఆవాలు – పావు చెంచా, పసుపు – చిటికెడు, కరివేపాకు – రెండు రెబ్బలు, పచ్చిమిర్చి – ఒకటి, కారం – పావుచెంచా, జీలకర్రపొడి – అరచెంచా, కొత్తిమీర – కట్ట, ఉప్పు – తగినంత, నూనె – చెంచా.

తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్రపొడి వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. ఇందులో ఇడ్లీ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టేయాలి. ఇడ్లీ ముక్కలు వేగాయనుకున్నాక దింపేస్తే చాలు. సాస్‌తో కలిపి వడ్డించి చూడండి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos