భారత సైన్యం అమ్ములపొదిలోకి తేజస్‌..

భారత సైన్యం అమ్ములపొదిలోకి తేజస్‌..

కొద్ది కాలంగా పాకిస్థాన్‌తో పాటు చైనా చివరకు నేపాల్‌ దేశం సైతం భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతుండడంతో భారత సైన్యం,కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి.ఒకవైపు పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పదేపదే కాల్పులు జరుపుతుంటే మరోవైపు చైనా సైతం సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతోంది.తాజాగా నేపాల్‌ సైతం భారత్‌పై యుద్ధానికి సై అంటూ రంకెలు వేస్తోంది.దీంతో మూడు దేశాల ఆట కట్టించడానికి సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసేలా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రవేశించింది. తొలి లైట్కాంబాట్ఎయిర్క్రాఫ్ట్తేజస్ఎంకే–1నుఫ్లయింగ్బుల్లెట్స్‘‌లోకి ప్రవేశపెట్టింది. కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఎయిర్ఫోర్స్స్టేషన్‌లో  కార్యక్రమం జరిగింది. తేజస్ ఫైటర్ జెట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (హెచ్ఏఎల్‌) తయారు చేసింది. అన్ని పరీక్షలనూ తట్టుకుని నిలిచిన తేజస్ విమానాలను వాయుసేనకు అప్పగించాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది.తేజస్ఎంకే–1 ఫోర్త్ జనరేషన్ సూపర్సానిక్కాంబాట్ఎయిర్క్రాఫ్ట్లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం కావడం విశేషం. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు. దీని బరువు 6,560 కిలోలు కాగా, 15 కిలోమీటర్ల ఎత్తులోనూ ఎగరగలదు. దీని పొడవు 13.2 మీటర్లు కాగా, 1,850 కిలోమీటర్ల పరిధిలో దూసుకెళుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos