సోనియా భావోద్వేగ లేఖ..

సోనియా భావోద్వేగ లేఖ..

కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతిపై ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.అరుణ్‌జైట్లీ భార్యను కలసి పరామర్శించిన సోనియా అరుణ్ జైట్లీకి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ స్నేహితులేనని, అతడు కూడా అందరి స్నేహితుడని వ్యాఖ్యానించారు. మీ ప్రియమైన భర్త అరుణ్ జైట్లీ మరణ వార్తను తీవ్రంగా కలత చెందానని సోనియా గాంధీ.. సంగీతకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఆయన ఒక మేధావి. ఆయన మాట తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.కేబినెట్ మంత్రిగా పూర్తి శక్తిసామార్థ్యాలతో పనిచేశారు. పూర్తి న్యాయం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అందరి మన్ననలు అందుకున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా రాణించారుఅని సోనియా గాంధీ తన లేఖలో అరుణ్ జైట్లీని కొనియాడారు.తీవ్రమైన అస్వస్థతతో అరుణ్ జైట్లీ ధైర్యంగా పోరాడి ఓటమిపాలయ్యారు. చిన్న వయస్సులోనే జైట్లీ మరణించడం దేశానికి తీరని లోటు అని సోనియా గాంధీ అన్నారు. సానుభూతి తెలపడంతో సరిపెట్టుకోలేను.. మీ, మీ కూతురు, మీ కుమారుడు బాధను అర్థం చేసుకోలను. అరుణ్ జీకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని సంగీతా జైట్లీకి రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు. మధ్యాహ్నం 02.30 గంటలకు అరుణ్‌జైట్లీ పార్థివదేహానికి యమునా నది ఒడ్డున వున్న నిగంబోధ్లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos