హువావే ఆపరేటింగ్‌ సిస్టమ్‌

హువావే ఆపరేటింగ్‌ సిస్టమ్‌

డాంగువాన్: చైనా మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువావే సొంతంగా తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ శుక్రవారం ఇక్కడ జరిగిన హువావే డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించింది. దీని పేరు హార్మని ఓఎస్ (HarmonyOS). ‘ప్రపంచమంతా మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనేది ఉప శీర్షిక. ‘ఇది  భవిష్యత్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్, ఐఓఎస్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తొలి వెర్షన్ను ఈ ఏడాది చివ రి నాటికి స్మార్ట్స్క్రీన్ ఉత్పత్తుల్లో అందుబాటులోకి తీసుకురానున్నాం. రానున్న మూడేళ్లలో మా అన్ని ఉత్పత్తుల్లో ఈ ఓఎస్ను తీసుకొస్తాం’ అని సంస్థ వినియోగదారు విభాగాధిపతి హెడ్ రిచర్డ్ యు తెలిపారు. అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదరటంతో హువావే ఫోన్లకు తమ ఆప రేటింగ్ సిస్టమ్ను ఈ నెల తర్వాత అందించ బోమని లేదని గూగుల్ ప్రకటించింది. హువావే ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ల వల్ల విదేశాల్లో హువావే గిరాకీ తగ్గే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos