హోండా కర్మాగారం మూసివేత

హోండా కర్మాగారం మూసివేత

మనేసర్(హర్యాన): ఇక్కడి ద్వి చక్ర వాహనాల తయారీ పరిశ్రమను నిరవధికంగా మూసివేసినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మంగళ వారం ఇక్కడ ప్రకటించింది. కార్మికుల సమ్మె వల్ల సాధారణ కార్యకలాపాలన్నీ నిలిపి వేసినట్లు వివరించింది. కార్మిక సంఘాల నేతలు, యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్లు ఒక ప్రకటనలో తెలి పింది. కార్మిక సంఘాల నేతలు, , శాశ్వత ఉద్యోగులు , ఒప్పంద కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. కంపెనీ ప్రాంగణం వారి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు నిలయంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో వాహనాల తయారీ సాధ్యం కాదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని విపులీకరించింది. సాధారణ పరిస్థితి నెలకొన్న తరువాత పనులు ప్రారంభమ వుతాయని తెలిపింది.వాహనాల తయారీని తగ్గించినందున ఒప్పంద కార్మికుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఈ నెల 5 నుంచి అక్కడి కార్మికులు సమ్మెకు దిగారు. వారికి రాజకీయ పక్షాలు, ఇతర కర్మాగారాల కార్మిక సంఘాలు మద్దతిస్తు న్నాయి. రోజుకు తయారయ్యే బైక్ ల సంఖ్యను ఆరు వేల నుంచి 3,500కు కుదించినపుడు దాదాపు 1000 మంది ఉద్యోగా ల్ని కోల్పోయారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకూ ఒక మారు పెంచాల్సిన వేతన శ్రేణిని కూడా యాజమాన్యం సవరించ లేదని కార్మికులు సమ్మెకు దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos