నియోజకవర్గాల పెంపుపై కదలిక..

నియోజకవర్గాల పెంపుపై కదలిక..

 దక్షిణాదిలో కర్ణాటక,గోవాలు పాగా వేశాక కమలనాథులు దక్షిణాదిలో కీలక రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలపై పట్టు సాధించుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఏమాత్రం వెనుకడగు వేయడం లేదు.ఇప్పటికే పలురువు నేతలను పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ నేతలు రెండు రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు.క్షేత్రస్థాయి కార్యకర్తలను సైతం వదలకుండా బీజేపీలో చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపుపై కూడా కమలనాథులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఇదే విషయంపై గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తనంతట తానే స్థానాల పెంపు అంశంపై పావులు కదుపుతున్నట్లు సమాచారం.పార్టీలో చేరిన కీలకనేతలతో పాటు ద్వితియశ్రేణి నేతలను కూడా పార్టీలో కీలకనేతలుగా గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో శాసనసభ స్థానాల పెంపుదలపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.దక్షిణాదిలో పాగా వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కీలకంగా మారడంతో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇక రెండు రాష్ట్రాలతోపాటు జమ్ము కశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో కూడ సీట్లను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభన బిల్లును గట్టేంచిందేకు కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో కశ్మీర్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముందుగా కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించిన బీజేపీ ప్రభుత్వం అందులో భాగంగా ఆరు నెలల పాటు గవర్నర్‌ పాలన కొనసాగిస్తూ పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకుంది.కశ్మీర్‌లో పట్టు సాధించాక తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos