కరోనాను హాలీవుడ్‌ ముందే ఊహించిందా!

  • In Film
  • March 24, 2020
  • 116 Views
కరోనాను హాలీవుడ్‌ ముందే ఊహించిందా!

కరోనా వైరస్ను సినీ ప్రపంచం ముందే ఊహించిందా? సినిమాల గురించి తెలిస్తే నిజమేనని అనిపించకమానదు. సినిమా అంటేనే ఊహా ప్రపంచం. తమ సినిమాల కోసం విభిన్న కథలను అన్వేషిస్తుంటారు. విషయంలో హాలీవుడ్ అందరికంటే మెట్టు పైనే ఉంటుంది. జంతువులను, వైరస్లను కథా వస్తువుగా చేసుకోవడంలో వీరు నిష్ణాతులు. ఊహాత్మక కథనాలతో సినిమాను రూపొందించి విజయం సాధించడంలో వీరు దిట్ట. అలా రూపొందించిన యుగాంతం, ప్రళయం, వైరస్ వంటి సినిమాలు సెన్షేషనల్ అయ్యాయి.  ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టేసిన కరోనా వైరస్ను కూడా వీరు ముందే ఊహించారు. ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే వచ్చిన సినిమాలేవో చూద్దాం.స్లమ్‌ డాగ్‌ మిలీనియర్‌ చిత్ర దర్శకుడు డెన్నీ బాయ్లే దర్శకత్వంలో తెరకెక్కిన 2007లో విడుదలైన ‘28 వీక్స్ లేటర్సినిమాలోరేజ్అనే వైరస్ను కథా వస్తువుగా తీసుకున్నారు. వైరస్ సోకిన వారికి విపరీతమైన కోపం వస్తుంది. దీనిని నియంత్రించేందుకు తయారుచేసిన డ్రగ్ను ప్రయోగించేందుకు చింపాంజీలో వైరస్ను సృష్టిస్తారు. తర్వాత వైరస్ మనుషులకు సోకి జోంబీల్లా మారిపోతారు.ఇట్ కమ్స్ ఎట్ నైట్’ (2017) అనే సినిమాలో గుర్తు తెలియని వైరస్ మనుషులను చంపేస్తుంటుంది. ఇందులోని సీన్లు చాలా సహజంగా అనిపిస్తాయి. 2006లో వచ్చినచిల్డ్రన్ ఆఫ్ మెన్సినిమా కూడా ఇలాంటిదే. ఇందులో వైరస్ కనిపించదు. 2027లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి తీసిన సినిమా ఇది. ఇదో విజువల్ వండర్. 1995లో వచ్చిన ‘12 మంకీస్సినిమా కూడా కోవలోకే వస్తుంది. సినిమాలోని వైరస్ వల్ల భూమ్మీది ప్రజలంతా చనిపోతారు. వైరస్ను నివారించేందుకు కథానాయకుడు గతానికి వెళ్తాడు.  2008లో వచ్చినబ్లైండ్నెస్సినిమాలో వైరస్ వల్ల కళ్లు పోతాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకడంతో అందరి కళ్లూ పోతాయి. దీంతో రోగులను ప్రభుత్వం ఐసోలేషన్లో ఉంచుతుంది. 2013లో వచ్చినవరల్డ్ వార్ జడ్కూడా ఇలాంటి సినిమానే. హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్పిట్ నటించిన సినిమాలో జాంబీ వైరస్ వల్ల ప్రజలు రాక్షసుల్లా మారిపోతారు. ఒకరి ద్వారా ఇది ప్రపంచమంతా సోకుతుంది. దీనిని అరికట్టేందుకు హీరో ప్రపంచదేశాల సాయం తీసుకుంటాడు. అలాగే,  2013లో వచ్చినఫ్లూ’, 1995లో వచ్చినఔట్ బ్రేక్’, గతేడాది వచ్చినవైరస్’, 2011లో వచ్చిన కంటేజియన్ వంటి సినిమాలు వైరస్ కథాంశంతో తెరకెక్కినవే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos