షా రాజేసిన హింది వ్యతిరేక అగ్ని

షా రాజేసిన హింది వ్యతిరేక అగ్ని

న్యూఢిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హిందీ భాషా దినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశమంతటా హిందీ వ్యతిరేకతను రాజేశాయి. పలువురు రాజకీయ నేతలు అంతెత్తున మండిపడ్డారు. ‘భిన్నభాషలు, యాసలు ఉండటం మన దేశపు బలం. కానీ మన దేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా మన పూర్వీ కులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు. ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుంది. హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుంది. భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాల’ని ట్విట్టర్లో పిలుపు నిచ్చారు. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయని పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలు అంతెత్తున ఎగిరిపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos