హిందువులూ హింసకు అతీతులు కారు

హిందువులూ హింసకు అతీతులు కారు

భోపాల్: హిందూ గ్రంథాలు హింసమయమని భారత కమ్యునిస్ట్ పార్టీ (మార్కిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘హిందువులు హింసను విశ్వసించరని ప్రగ్యా ఠాగూర్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. కానీ ఈ దేశంలోని ఎంతో మంది రాజులు, రాజ్యాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. అంతెందుకు రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా యుద్ధము, హింసే కదా. హిందువులు హింసకు అతీతం కాదని మాత్రం చెప్పకండి. హింసలో కేవలం ఒక మత ముందని, హిందుత్వం దానికి అతీతమని చెప్పడమేంటి.. ఇదేం తర్ఖమ’ని ప్రశ్నించారు. భాజపా హిందుత్వ ఎజెండాను ఎగదోస్తోందని ఆరోపించారు. ‘ఎన్నికలు సమీపించగానే భాజపాకు రామమందిరం, రాజ్యాంగంలోని 35ఏ, సెక్షన్ 370, అధీకరనలు, ఉమ్మడి పౌర స్మృతి, జాతీయ పౌరసత్వం నమోదు లాంటివి గుర్తుకు వస్తాయి. ప్రజల భావోద్వేగాలతో రాజకీయం చేయడం ప్రారంభింస్తారు’’ అంటూ దుమ్మెత్తి పోశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos