బురఖా ధరించడం క్రమశిక్షణ ఉల్లంఘనే

బెంగళూరు:  బాలలుపాఠశాలలు, కాలేజీలకు బురఖాలు,  ముసుగులు( హిజాబ్‌)  ధరించి రావడం క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని విద్యా  మంత్రి బీసీ నగేశ్ వ్యాఖ్యానించారు. ‘‘1985లో యూనిఫామ్ లను ప్రవేశపెట్టింది విద్యార్థులలో ఏకత్వం తీసుకురావడం కోసమే. విద్యాలయాలు ఒకరి మత ఆచారాలకు వేదిక కాకూడదని’ అన్నారు. ఉడిపి జిల్లా బాలికల ప్రభుత్వ కళాశాలకు  బురఖాలతో విద్యార్థినులను అనుమతించడం లేదు. దీంతో బురఖాతో తరగతి గదిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు విద్యార్థినులు గత డిసెంబర్ నుంచి కాలేజీ వద్దే నిరసనకు దిగారు. దీనిపై మంత్రి స్పందించారు. విద్యార్థుల చర్య రాజకీయ ప్రేరేపితం అంటూ కళాశాల చర్యను సమర్థించారు. ‘‘ఒకవేళ ఆరుగురు విద్యార్థినులు తమ మత విశ్వాసాన్ని ఆచరించే విషయంలో అంత మొండిగా ఉంటే కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చు. బురఖాలను అనుమతించే మరో విద్యా సంస్థలో చేరొచ్చు’’ అని నగేశ్ స్పష్టం చేశారు. అదే కాలేజీలో మరో 94 మంది ముస్లిం విద్యార్థినులు యూనిఫామ్ తో వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు నిరసనకు దిగిన ఆరుగురు విద్యార్థినులు సైతం గత ఏడాదిన్నరగా బురఖాలు లేకుండానే తరగతులకు హాజరైనట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos