బాలయ్య పేరు చెబితే పారిపోతున్నారు..

  • In Film
  • June 19, 2019
  • 117 Views
బాలయ్య పేరు చెబితే పారిపోతున్నారు..

తెలుగు చిత్ర పరిశ్రమలో వృద్ధ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు కొత్త చిత్రంలో హీరోయిన్లే కరువయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా అంటేనే హీరోయిన్లు అయ్య బాబోయ్‌ అంటూ పారిపోతున్నారట.మరి కొంతమంది అసలు ఫోన్లకు కూడా స్పందించకుండా అందుబాటులో లేకుండా పోయారని టాక్‌ వినిపిస్తోంది.బాలయ్య, వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలకు హీరోయిన్లు దొరకడం పెద్ద టాస్క్ అయిపోయింది.నయనతార, శ్రియ వంటి తారలను రిపీట్ చేస్తూ ఆ లోటు తీర్చుకుంటున్నారు. బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో మొదలైన కొత్త చిత్రంలో హీరోయిన్‌ కోసం ప్రయత్నిస్తున్న చిత్రబృందానికి గతంలో బాలయ్యతో నటించి హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న నయన్ బిజీ అయిపోవడం, శ్రియ అందుబాటులో లేకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను సంప్రదించగా  ప్రాజెక్ట్ లేట్ అవుతుండడంతో పాయల్‌ తప్పుకుంది. ఒకరిద్దరు హీరోయిన్లను సంప్రదిస్తే డేట్స్ లేవని చెప్పి పంపించేశారట. మెహ్రీన్ అయినా చేస్తుందనుకుంటే ఆమె కూడా హ్యాండ్ ఇచ్చేసిందట. దాంతో కాజల్, శ్రియలను సంప్రదించే పనిలో పడ్డారట. వారు కూడా ఓకే చెబుతారో లేదో డౌటే!.నలుగురు వృద్ధ అగ్రహీరోల్లో వెంకటేశ్‌ మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా మిగిలిన ముగ్గురు హీరోలైన చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జులను మాత్రం కుర్రహీరోయిన్లతో రొమాన్స్‌లు చేస్తున్నారు.ఆరు పదుల వయసు దాటి కొడుకులకు,కూతుళ్లకు పెళ్లిళ్లయి మనవళ్లు,మనవరాళ్లు పుట్టినా వృద్ధ హీరోలు మత్రం తమ కొడుకులు,కూతుళ్ల వయసుకున్న అంతకంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో రొమాన్స్‌లు చేస్తుండడం మారిన ఎబ్బెట్టుగా అనిపిస్తోందని యువ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని ఈ వృద్ధ హీరోలు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రేమంటూ యువ హీరోయిన్ల వెంట పడే సినిమాలు కాకుండా వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాలంటూ సలహాలు సూచిస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos