బిగ్‌బాస్‌ 3 లో తరుణ్?

  • In Film
  • June 17, 2019
  • 121 Views
బిగ్‌బాస్‌ 3 లో తరుణ్?

బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన షోలలో బిగ్‌బాస్‌ కూడా ఒకటి.హౌస్‌లో జరిగే గొడవలు,నాటకాలు,గేమ్‌లకు బాగా కనెక్టయ్యే ప్రేక్షకులు బిగ్‌బాస్ వచ్చే సమయంలో టీవీలకు అతుక్కుపోతుంటారు.బిగ్‌బాస్‌ షో వల్ల అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులు ఒక్కసారిగా ప్రేక్షకులకు దగ్గరవుతారు.అందుకే సినీ ఇండస్ట్రీలో గుర్తింపు కోసం తపన పడే చిన్నచిన్న నటీనటులు ఇతర వ్యక్తులు బిగ్‌బాస్‌షోలో పాల్గొనడానికి అంగీకరిస్తుంటారు.ఈక్రమంలో బాలనటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి లవర్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ మూడవ సీజన్‌లో పాల్గోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది కాలం వరుస హిట్‌లతో దూసుకుపోయిన తరుణ్‌ అనంతరం క్రమక్రమంగా సినిమాలకు దూరమవుతూ వచ్చాడు.అప్పటి నుంచి ప్రేక్షకుల్లో పూర్తిగా క్రేజ్‌ కోల్పోయిన తరుణ్‌ బిగ్‌బాస్‌ షో ద్వారా అంతోఇంతో గుర్తింపు తెచ్చుకోవడానికి బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడానికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos