ప్రపంచ బ్యాంకు భారీ సాయం

న్యూఢిల్లీ: కరోనా నివారణ చర్యల్ని చేపట్టేందుకు మన దేశానికి ప్రపంచ బ్యాంకు రూ. 7,583 కోట్లు) సాయం చేయనుంది. ఈ మొత్తాన్ని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజస్ కంట్రోల్ (ఎన్సీడీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లు సంయుక్తంగా ఖర్చు చేయనున్నాయి. కొత్త పరికరాలు, మౌలిక వసతులు, డాక్టర్ల రక్షణకు అవసరమైన సూట్లు, మాస్క్ ల తయారీకి మొత్తాన్ని వెచ్చిస్తారు. వ్యాధి బారిన పడిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వ్యాపించే ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాలు, మెడికల్ అండ్ ఎమర్జెన్సీ సేవల్లో పాల్గొనే వ్యక్తులు, టెస్టింగ్ కేంద్రాలు ల కోసం ఈ నిధిని వెచ్చిస్తారు. వెంటనే నిధులు మంజూరు కానున్నందున ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తీసుకునే చర్యలకు, వ్యాధి మరింత విస్తరించకుండా నివారణ చర్యలకు దీన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా సమాచారం