అమిత్‌షా హెలికాప్టర్ వివాదం.. బీజేపీ, మమత డిష్యుం డిష్యుం..!

అమిత్‌షా హెలికాప్టర్ వివాదం.. బీజేపీ, మమత డిష్యుం డిష్యుం..!

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హెలికాప్టర్‌ను మాల్డా ఎయిర్‌స్ట్రిప్‌పై దిగేందుకు మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం వివాదానికి దారితీసింది. ఇది అధికార దుర్వినియోగమేనని బీజేపీ మండిపడగా, అనుమతి ఇవ్వలేదంటూ ప్రజలను తప్పదారి పట్టిస్తారా అంటూ టీఎంసీ ఎదురుదాడికి దిగింది. అమిత్‌షా హెలికాప్టర్‌ను మాల్డా హెలిపాడ్‌పై దిగిందేకు టీఎంసీ సర్కార్ అనుమతించలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారంనాడు మీడియాకు తెలిపారు. ఇదే హెలిపాడ్‌పై కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ హెలికాప్టర్ ల్యాండ్ అయిందని చెప్పారు. ‘కొందరు జర్నలిస్టులు కూడా అక్కడకు వెళ్లారు. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. హెలిప్యాడ్ చాలా క్లీన్‌గా ఉంది. హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్నాయి. అవుతాయి కూడా. ప్రభుత్వం తప్పుడు సాకులు చూపించి, అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోంది’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వక్రీకరణలొద్దు: మమతకాగా, రవిశంకర్ ప్రసాద్ విమర్శలను టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. తాము అనుమతి ఇచ్చినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని ఆమె చెప్పారు. భద్రతా కారణాల రీత్యా అమిత్‌షా హెలికాప్టర్‌ను వేరే చోట ల్యాండ్ చేయాలని పోలీసులు కోరారని, తాను సైతం పోలీసుల అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ల్యాండింగ్‌‌ను వేరేచోట మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నందువల్లే అమిత్‌షా మీటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. కాగా, ఇటీవలే ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం డిశ్చార్స్ అయిన అమిత్‌షా…ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న మాల్డాలోని ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. కోల్‌కతాకు చేరుకుని అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో మాల్డా వెళ్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos