హొసూరులో భారీ వర్షం

హొసూరులో భారీ వర్షం

హొసూరు : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు కొంత ఊరట కలిగినా కొన్ని చోట్ల పంటలు నాశనమయ్యాయి. హొసూరు, బాగలూరు, బేరికే, సూలగిరి, డెంకణీకోట, అంచెట్టి, తళి, తదితర ప్రాంతాలలో గత నెల రోజులుగా ఎండలు ఎక్కువవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఎండ తీవ్రతకు బోరు బావుల్లో కూడా నీరు తగ్గడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గత రెండు రోజులుగా హోసూరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలవల్ల ఊరట కలిగింది. సోమవారం హోసూరు ప్రాంతంలో పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని వర్షం కురవడంతో వేడి తగ్గడమే కాకుండా రైతులకు ఉమశనం కలిగినట్లైంది. కానీ పలు చోట్ల కోతకు వచ్చిన దశలో వర్షం కురవడంతో కొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల రవాణా నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన హోసూరు రైతన్న రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల మరింతగా నష్టపోయాడు.

క్రిష్ణగిరి జిల్లాలో 87.7 మిల్లీమీటర్ల వర్షపాతం

కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురవడంతో వేసవి తాపం తగ్గి ప్రజలు ఊరట పొందారు. క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు, డెంకణీకోట. సూలగిరి, క్రిష్ణగిరి  తదితర ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 87.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లాలోనే అత్యధికంగా పెనుకొండాపురంలో 43 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. డెంకణీకోట  ప్రాంతంలో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos