భూపతి రెడ్డికీ అదే అనుభవం

భూపతి రెడ్డికీ అదే అనుభవం

హైదరాబాద్ : శాసన మండలి సభ్యత్వంపై భూపతి రెడ్డి అనర్హతను హైకోర్టు సమర్థించింది. స్పీకర్, మండలి ఛైర్మన్లకు సభ్యులపై అనర్హత విధించే అధికారాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయని స్పష్టం చేసింది. భూపతిరెడ్డిపై అనర్హత చట్టబద్ధంగానే ఉందని పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని 8వ పేరాను సవాల్ చేస్తూ భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారంటూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేశారు. భూపతిరెడ్డితో పాటు అనర్హతకు గురైన యాదవ రెడ్డి, రాములు నాయక్ల పిటిషన్లను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos