బాల్కనీ బాబులు కాస్త కిందకు చూడాలి

బాల్కనీ బాబులు కాస్త కిందకు చూడాలి

చెన్నై: ‘బాల్కనీ బాబులు కాస్త కిందకు చూడాల’ని లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, సొంతూళ్లకు వెళ్ల లేక పోయిన వలస కార్మికుల దుస్థితిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ బుధవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.‘బాల్కనీలో ఉండేవారికి కిందికి చూడటం కష్టమవుతుంది. మొదట దిల్లీలో ఈ పరిస్థితి. ఇప్పుడు ముంబయి. వలసకార్మికుల సంక్షోభం అనేది ఒక టైమ్ బాంబ్ లాంటిది. అది కరోనా కంటే పెద్ద సంక్షోభం కాకముందే తగ్గించాలి. బాల్కనీ ప్రభుత్వాలు కింద కూడా ఏం జరుగుతుందో చూడాలి’ అని విరుచుకు పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos