బడ్జెట్‌ ముద్రణ ఆరంభం

బడ్జెట్‌ ముద్రణ ఆరంభం

న్యూఢిల్లీ : ఆనవాయితీ ప్రకారంహల్వా తయారీతో 2019 -20 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణ శనివారం ఆరంభమైంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మలా సీతారామన్ జూలై 5న బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. హల్వా తయారీ కార్యక్రమం తర్వాత ఆర్థిక మంత్రి లోక్సభకు బడ్జెట్ను సమర్పించేంత వరకూ ముద్రణతో సంబంధమున్న ముఖ్య అధికారులు, ఇతర సహాయ సిబ్బంది ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. కొందరు ఉన్నత అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారు కనీసం వారి ఆప్తులతో సైతం ఏ సమాచార సాధనాల ద్వారానూ మాట్లాడే అవకాశం ఉండదు. బడ్జెట్ విషయాలు ముందుగానే ఇతరులకు తెలిస్తే కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం న్నందున బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి కల్పించేంతటి భద్రతను బడ్జెట్ ముద్రణ వ్యవస్థకూ కల్పిస్తారు. నిఘా ,అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు తదితర పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos