అబ్బా..! ఎంత పొడవైన కురులో…

అబ్బా..! ఎంత పొడవైన కురులో…

పొడవైన కురులున్న మహిళలు రోడ్డుపై నడిచి వెళుతుంటే, సాటి మహిళలే కాదు
పురుషులు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. వాటికుండే ఆకర్షణ అలాంటిది. గుజరాత్‌కు చెందిన నిలాన్షి పటేల్‌ 16 ఏళ్ల వయసుకే పొడవైన జుట్టుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం మరో విశేషం. ఆరేళ్ల వయసులో మాత్రమే ఓసారి తన జుట్టును కత్తిరించుకుందంట. ఆ తర్వాత వరుసగా పదేళ్ల పాటు జుట్టు పెంచి, అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 16వ యేట అడుగుపెట్టిన నిలాన్షి 170.5 సెం.మీ. అంటే ఐదడుగుల ఏడు అంగుళాల పొడవైన జుట్టు కలిగిన టీనేజర్‌గా గుర్తింపు పొందింది. పొడవుగా జుట్టును పెంచడం వల్ల చాలా సమస్యలు వస్తాయని చుట్టుపక్కల వాళ్లు నిలాన్షికి సలహా ఇచ్చేవారంట. కానీ తన హెయిర్‌ వల్ల స్కూల్లో ఆటలు ఆడే సమయంలో గానీ ఇతర సందర్భాల్లో గానీ ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని చెబుతోంది నిలాన్షి. తల్లి తన జుట్టు సంరక్షణలో ప్రధాన బాధ్యత తీసుకుంటారని చెప్తోంది. ఈ గిన్నిస్‌ రికార్డు రావడం వెనుక కూడా తన తల్లి సహకారం చాలా ఉందంటోంది నిలాన్షి. ఏదైనా ఫంక్షన్లకి వెళ్లేటప్పుడు తనకు నచ్చిన మాదిరిగా జడ వేసుకుంటుందట! వారానికి ఒకసారి తలస్నానం చేయడంతోపాటు జుట్టును ఆరబెట్టుకోవడానికి అరగంట, దువ్వుకోవడానికి ఓ గంట సమయాన్ని వెచ్చిస్తానని నిలాన్షి చెబుతోంది. పొడవైన జుట్టు ఉండటమే కాదు.. దాన్ని సంరక్షించుకోవడమూ ఓ కళే!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos