జుట్టు బాగా రాలుతోందా…

జుట్టు బాగా రాలుతోందా…

జుట్టు రాలడం సహజ పరిణామమనే రోజులు పోయాయి. ముఖ్యంగా యువతుల్లో దీనిపై ఆందోళన నెలకొంటోంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి కనిపించిన వైద్యుని సంప్రదించడం ఈ మధ్య మామూలైపోయింది. రోజుకు వందకు మించి వెంట్రుకలు రాలుతుంటే ఏదో సమస్య ఉన్నట్టే అనుకోవాలి. మూల కారణాన్ని కనుక్కొంటే చికిత్స సులభమవుతుంది. జీవన శైలి మారుతున్న తరుణంలో జుట్టును బాగా సింగారించుకోవడానికి ఏవేవో ప్రయోగాలు చేయడం పరిపాటైంది. స్ట్రెయిటెనింగ్‌, కర్లర్లు తదితరాల వాడకం వల్ల వెంట్రుకలు పాడవుతాయి. వేడి వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇంకా కెమికల్‌ కర్లింగ్‌, వంకీలు తిరగడం కోసం, లేదా పాత స్టైల్‌కే రావడం కోసం చేసుకునే చికిత్సల వల్ల కూడా వెంట్రుకలు దెబ్బ తింటాయి. తరచూ హెయిర్‌ డై వాడడం వల్ల కూడా వెంట్రుకలు ఊడుతాయి. అయిదారు వారాలకోసారి మాత్రమే డై వాడడం మంచిది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు,  కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది. వీటికి బదులు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకుంటే మంచిది. నీరు కూడా బాగా తాగాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు రాలుతూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos