గుజరాత్ అల్లర్ల బాధితురాలికి భారీ పరిహారం

గుజరాత్ అల్లర్ల బాధితురాలికి భారీ పరిహారం

ఢిల్లీ
: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానోకు
రెండు వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు ఉద్యోగం, నివాసం కల్పించాలని సుప్రీం
కోర్టు మంగళవారం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం
వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన
న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. తప్పులు చేసిన
అధికారులకు పెన్షన్‌ ప్రయోజనాలను నిలిపివేయాలని, ముంబై హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్‌
అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని ఆదేశించింది. ఈ సంఘటన జరిగినప్పుడు బానో వయసు
19 ఏళ్లు. తన కుటుంబ సభ్యులతో కలసి లారీలో వెళుతుండగా అల్లరి మూక అడ్డుకుంది. అయిదు
నెలల గర్భిణి అయిన బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బానో రెండేళ్ల కుమార్తెతో
పాటు 14 మంది కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చారు. గుజరాత్‌ ప్రభుత్వం ఆమెకు రూ.5
లక్షల పరిహారం ఇవ్వజూపగా నిరాకరించారు. తనకు అపార నష్టం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం
నుంచి అసాధారణ పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos