రాజ్యసభ ఎన్నికలు-కాంగ్రెస్‌ కు చుక్కెదురు

న్యూఢిల్లీ:గుజరాత్‌ విధానసభ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తోసి పుచ్చింది. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో గుజరాత్‌లో వారి రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వచ్చే నెల 5న ఈ రెండు స్థానాకు విడి విడిగా ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది చట్ట వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టి బీఆర్ గోవైలతో కూడిన ధర్మా సనం విచారణ చేపట్టింది. ‘ఎన్నికల ఫలితాల తర్వాత పిటిషనర్ ఎన్నికల పిటిషన్ వేయడం మంచిది. ఎన్నికల సంఘం ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో కోర్టు జోక్యం చేసుకోజాలదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఇందులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొంది. రాజ్యాంగంలోని 32 వ అధీకరణ కింద కాంగ్రెస్ అత్యున్నత న్యాయ స్థానాన్నిఆశ్రయించ జాలదని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos