హోం గార్డును ‘లాక్కెళ్లి’న బీజేపీ నేత

హోం గార్డును ‘లాక్కెళ్లి’న బీజేపీ నేత

న్యూఢిల్లీ: రాంగ్ రూట్లో వస్తున్న భాజపా నేతకు చెందిన కారును అడ్డు కోబోయిన హోం గార్డు కారు బానెట్పై పడినా ఆగకుండా ముందుకు దూసుకు పోయిన దుర్ఘటన సోమ వారం హర్యానాలోని రేవారిలో జరిగింది. సంఘటన. రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదైంది. సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కి సంచలనంగా మారింది. స్థానిక పోలీసులు కథనం ప్రకారం సతీష్ ఖోడ అనే వ్యక్తి స్థానిక బీజేపీ నేత. ఆయన సోమ వారం రేవడిలోని ఓ ప్రాంతంలో తప్పు దారిలో ప్రయాణించారు. దీన్ని గుర్తించిన హోం గార్డు ఒకరు వెంటనే ఆ కారును ఆపేందుకు ప్రయత్నిం చారు. కారును ఆప లేదు. ముందుకు సాగేటపుడు ప్రమాద వశాత్తు హోం గార్డు కారు బానెట్ పై పడ్డారు. అయిన ఆగకుండా ముందుకు సాగి పోయారు. 300 మీటర్ల దూరం అలా ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని హోం గార్డు కాలం గడిపారు. పాద చారులు అడ్డుపడి కారు ఆపారు. దీంతో హోం గార్డు కొద్దిలో ప్రమాదం నుంచి బయడపడ్డారు. ‘తప్పుడు దారిలో వస్తున్న కారును ఆపాలని నేను కోరారు. కానీ కారు డ్రైవర్ ఇది సతీష్ ఖోడ కారు అని సమాధాన మిచ్చాడు. అంతే కాకుండా నన్ను కొట్టాడు’ అని హోం గార్డు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos