డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసు డ్యూటీ

డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసు డ్యూటీ

సూరత్: ఇక్కడి బర్డోలిలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల విధులు నిర్వర్తిస్తున్నారు. బార్డోలీ పోలీసు శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. దీంతో ఆర్టీసీ సిబ్బంది సేవల వినియోగానికి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీ అనుమతించారు. ‘ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. పట్టణంలో తిరిగేందుకు వారికి గుర్తింపు పత్రాల్ని అందించామ’ని పోలీస్ ఇన్స్ పెక్టర్ గిలాటర్ తెలిపారు. ‘సూరత్-బార్డోలి బస్సును నడిపేవాడిని. ఇప్పుడు పోలీసు విధులు నిర్వహిస్తుండటం కొత్తగా , ఆనందంగా ఉంద’ని డ్రైవర్ ప్రవీణ్ కులకర్ణి తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos