మంచి రోజులు వచ్చాకే మనువు

మంచి రోజులు వచ్చాకే మనువు

న్యూ ఢిల్లీ: మంచి రోజులు వచ్చాకే పెళ్లి చేసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా ప్రతినిధి రాఘవ్ చద్దా పేర్కొనటం సామాజిక మాధ్యమాల్లో సంచల నమైంది. రాజకీయుడుగా మారిన చార్టెడ్ అకౌంటెంట్ రాఘవ్కు కీర్తి అనే యువతి ట్విటర్లో పెళ్లిని ప్రతిపాదించారు. ‘సారీ కీర్తి. దేశ ఆర్థిక పరిస్థితి అంత గా బాలేదు. కాబట్టి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం సరైనది కాదు. అచ్చే దిన్ వచ్చాక మనం పెళ్లి గురించి చర్చించుకుందాం’ అని రాఘవ్ బదులి వ్వటంపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేసారు. ‘ఆయన సమాధానం హై లైట్గా ఉంది. సినీ హీరోల కంటే ఎక్కువగా ఓ ప్రజా ప్రతినిధిపై అమ్మా యిలు మనసు పారేసుకుంటున్నారు’ అంటూ కామెంట్లు పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos