రెండు రోజుల్లో 25 వేల కోట్ల ఆభరణాలు కొనేశారు

ముంబై: ధన్తేరస్ సందర్భంగా దేశంలో ఏకంగా 25 వేల కోట్ల విలువైన ఆభరణాల అమ్ముడయ్యాయి’ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర వస్తువుల కొనుగోళ్లు కూడా భారీగా జరిగాయి. దీపావళి ముంగిట దేశంలో మొత్తం వ్యాపారం రూ.45,000 కోట్లు దాటింది. ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఫర్నిచర్, అలంకరణకు అవసరమైన వస్తువులు, మిఠాయిలు, స్నాక్ బాక్సులు, వంటగది వస్తువులు, అన్ని రకాల పాత్రలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ వస్తువులలో సుమారు రూ. 20,000 కోట్ల వ్యాపారం జరిగిందని వ్యాపార వర్గాలు చెప్పాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కలిపి ఈ ఏడాది దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos