గ్లాడియేటర్‌కు సీక్వెల్

  • In Film
  • June 15, 2019
  • 123 Views
గ్లాడియేటర్‌కు సీక్వెల్

లాస్‌ఏంజిల్స్‌ : సుమారు రెండు దశాబ్దాల తర్వాత హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ గ్లాడియేటర్‌కు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై 46 కోట్ల డాలర్లను వసూలు చేసింది. రస్సెల్‌ క్రోవ్‌, నీలన్స్‌, డెరిక్‌, జాక్విన్‌ ఫొనిక్స్‌, ఓలివర్‌ రీడ్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. రోమన్‌ సామ్రాజ్యంలో రాజులు, చక్రవర్తులు బానిసలను వేట జంతువుల్లా పరిగణిస్తూ, వారి ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడతారోననేది ఇతివృత్తం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. నిర్మాతలు వాల్టర్‌ ఎఫ్‌ పార్క్స్‌, ల్యూరీ మెక్‌డొనాల్డ్‌లు 2018లో దీనిపై ప్రకటన చేసినా, ఇప్పుడు పనులను మొదలు పెట్టారు. గ్లాడియేటర్‌ కథ ముగిసిన 25 లేదా 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనేది గ్లాడియేటర్‌-2 కథా సారాంశం.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos