బాలిక గర్భవతి : నిందితుడు బాలుడు

బాలిక గర్భవతి : నిందితుడు బాలుడు

హోసూరు : బాలికపై అత్యాచారం చేసి ఆమె గర్భవతి కావడానికి కారణమైన బాలుడిని హోసూరు మహిళా పోలీసులు పొక్సో చట్టం కింద అరెస్టు చేశారు. హోసూరు మత్తిగిరి సమీపంలోని కురుబట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో బాలిక తలిదండ్రులు హోసూరు మహిళా పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహిళా పోలీసులు బాలికను హోసూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటన కురుబట్టి గ్రామంలో సంచలనం సృష్టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos