నగలే ప్రియమైన కానుకలు

నగలే ప్రియమైన కానుకలు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేయసికి బహుమతులు ఇవ్వడానికి ప్రియుడు ఆరాటపడుతుంటాడు. ఆమెకు ఇష్టమైన బహుమతి ఇస్తే, ఎంతో సంబరపడిపోతుందని అతనికి తెలుసు. కానీ ఆ ఇష్టాన్ని తెలుసుకోవడం ఎలా? ఆమెను అడిగితే ఇక థ్రిల్‌ ఏముంటుంది? ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ కానుకల జాబితాలో నగలు తొలి స్థానంలో ఉన్నాయట. తర్వాతి స్థానాలు…గ్రీటింగ్‌ కార్డులు, చాక్లెట్లు, పువ్వులవేనట. ఓ డాట్‌ కామ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లోని ప్రేమికుల్లో 23 శాతం మంది ఆభరణాలను, 14 శాతం మంది గ్రీటింగ్ కార్డులను, 12 శాతం మంది చాక్లెట్లను సమర్పించుకుంటున్నారు. ఏ కానుకైనా ప్రేమను ప్రతిబింబించే హృదయాకారం తప్పనిసరి. ముద్దుకు మించిన కానుక ఏముంటుందని సర్వేలో పాల్గొన్న కొందరు ప్రేమికులు చెప్పారట.

తాజా సమాచారం