ఓటరు కార్డు పౌరసత్వ సూచిక కాదు

ఓటరు కార్డు పౌరసత్వ సూచిక కాదు

గౌహతి:‘పౌరసత్వానికి వోటరు పత్రం సాక్ష్యం కాదు. దాన్ని కలిగి ఉన్నంత మాత్రాన దేశ పౌరులుగా చెప్పలేమ’ని గౌహతి ఉన్నత న్యాయ స్థానం సోమ వారం తీర్పునిచ్చింది. పౌరసత్వానికి సంబంధించి తగిన ఆధారాలు కావాలని పేర్కొంది. ‘మా కుటుంబం బెంగాల్ నుంచి అస్సాం లోని టిన్సుకియాకు వలస వచ్చింది. నాకు ఓటరు కార్డు ఉంది. నేనూ వోటేసాను. దాని ఆధారంగా నన్ను భారత పౌరుడిగా గుర్తిం చాల’ని మునీంద్ర విశ్వాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణజరిపిన న్యాయస్థానం ఈ తీర్పు నిచ్చింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటి జన్ షిప్ (ఎన్నార్సీ) పట్టికలో మునీంద్ర బిశ్వాస్ పేరు లేక పోవటంతో ఆయన న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. ఆయన దేశ పౌరుడ నేం దుకు తగిన ఆధారాలు సమర్పించ నందునే ఎన్నార్సీలో చేర్చలేదని అధికారులు తెలిపారు. అస్సాంలో 1966 ను కటాఫ్ డేట్గా నిర్ణయిం చా రు. మునీంద్ర కుటుంబం అంతకన్నా ముందు వలస వచ్చినట్లు ఆధారాలేమీ లేవని న్యాయ స్థానం తేల్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos