సావర్కర్‌ గే?

సావర్కర్‌ గే?

భోపాల్: అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ విడుదల చేసిన వీర సావర్కర్ కితనా వీర్? కర పుస్తకం వివాదాస్పదమైంది. ఇక్కడ జరుగుతున్న పది రోజుల శిక్షణా శిబిరంలో దాన్ని వితరణ చేసారు. ‘గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే, వీర సావర్కర్ మధ్య ‘దైహిక సంబంధం ఉంది. గాడ్సే బ్రహ్మచర్యం తీసుకునే ముందు ఆయన తన రాజకీయ గురువు వీర సావర్కర్తో శారీరక సంబంధాలు కలిగి ఉన్నార’ని పేర్కొంది. డొమినిక్ లపైరె, లారీ కొల్లిన్స్ రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్నైట్’ పుస్తకంలోని అంశాల్ని ఇందుకు దన్నుగా ఉల్లేఖించారు. అండమాన్ సెల్యులర్ జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ వారి నుంచి సావర్కర్కు డబ్బులు అందుకున్నారనీ ఆ పుస్తకం ఆరోపిం చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos