రష్య దెబ్బకు జర్మనీ కుదేలు

రష్య దెబ్బకు జర్మనీ కుదేలు

బెర్లిన్ : ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ ఆర్థికమాంద్యం కోరల్లోకి జారుకుంటోంది. ఆ దేశ వ్యాపార వృద్ధి సూచీ సెప్టెంబర్ లో 84.3కు పడిపోయింది. ఆగస్టు నెలలో ఇది 88.5 శాతం. సెప్టెంబర్ గణాంకాలు 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం స్థాయికి కుంగిపోవడం గమనార్హం. పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ లేక కంపెనీలు భారీగా నష్ట పోతున్నాయి. ఇంధన, కమోడిటీ ధరలు పెరిగిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఇంధన ఆధారిత వ్యాపారాలను మూసివేసే దిశకు చేరుకుం టున్నాయి. ఈ ప్రభావం జర్మనీ నుంచి మొత్తం ఐరోపాకు విస్తరించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం యూరప్ పరిస్థితినే మార్చి వేసింది. యుద్ధానికి ముందు రష్యా నుంచి జర్మనీ తక్కువ ధరకే సహజవాయువును పొందేది. అయితే, రష్యా సైనిక చర్యను నిలువరించేందుకు ఆ దేశంపై యూరప్ దేశాలు ఆంక్షలను విధించా యి. రష్యా ఇందన దిగుమతులపై ఆంక్షలను విధించాయి. దరిమిలా రష్యా నుంచి సహజవాయువు ఆగిపోవడంతో అమెరికా వంటి దేశాల నుంచి ఖరీదైన లిక్వి ఫైడ్ గ్యాస్ ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రష్యా నుంచి గ్యాస్ పైప్ లైన్ ద్వారా వస్తుండగా. ఇప్పుడు నౌకల ద్వారా రవాణా చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో ధర మరింత పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ జర్మనీని ఆర్థికమాంద్యంలోకి నెట్టేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos