మన జిడిపియే అధికం

మన జిడిపియే అధికం

ముంబై : ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ జీ-20 దేశాల్లో కెల్లా భారత్లోనే జిడిపి అధికంగా ఉందని భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో అన్నారు. ‘ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదుడుకుల్లో ఉన్నాయి. ఖరీఫ్లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. భారత్ జిడిపి 1.9 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీ-20 దేశాల్లో కెల్లా భారత్ జిడిపి నే అధికం. జిడిపి లో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. బ్యాంకుల కార్య కలాపాలు సాఫీగా సాగుతున్నాయి. 2021-22 ఏడాదికి వఅద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధి రేట్లు తిరోగమనంలో ఉన్నాయి. నిర్బంధం(లాక్డౌన్) తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91 శాతం ఎటిఎం లు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటిఎం లలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంద’ని వివరించారు.

తాజా సమాచారం