బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన ‌ జగన్‌

బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన ‌ జగన్‌

విజయవాడ: దశాబ్దకాలంగా మూతపడిన బాపు పురవస్తు శాల ను ముఖ్యమంత్రి జగన్ గురువారం పునఃప్రారంభించారు. దీన్ని రూ.8 కోట్ల వ్యయంతో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని ఆధునికీకరించారు. పురాతన శిల్పకళతో తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం అనంతరం జగన్ అక్కడి చారిత్రక, పురాతన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. ఇందులో మానవ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే 1,500 అత్యంత ప్రాచీన వస్తువులను చూడవచ్చు. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడు ఉపయోగించిన వస్తువులనూ చూడొచ్చు. మధ్య యుగాల్లో మట్టితో తయారైన శవపేటిక ఇందులో ప్రధాన ఆకర్షణ. ప్రతి వస్తువు వద్ద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి బాపు మ్యూజి యం యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ వస్తువు పూర్తి వివరాలు ఫోన్ లో ప్రత్యక్ష మవుతా యని పురావస్తు విభాగం కమిషనర్ వాణీ మోహన్ జగన్ కు విపులీకరించారు. అనంతరం త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్ర హాన్ని కూడా ఆవిష్కరించారు. విక్టోరియా మహల్ లో మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos