నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు?

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు?

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార దోషుల ఉరిశిక్ష అమలు నిర్ణయాన్ని ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టు వాయిదా వేసింది. మరణ శిక్షకు ముందు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించు కునేందుకు దోషులకు వారం గడువు కల్పించింది. క్షమాభిక్ష వ్యాజ్యాల్ని దాఖలుకు తాఖీదులు జారీ చేయాలని తీహార్ చెరసాల అధికారులను ఆదేశించింది. అప్పటివరకు ఉరి శిక్ష ఉత్తర్వుల్ని జారీ చేయ లేమని తెలిపింది. దోషి అక్షయ్ సింగ్ సమీక్ష వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయ స్థానం బుధ వారం కొట్టి వేసినందున పాటియాలా న్యాయ స్థానం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రతి వచ్చేంత వర కూ నిరీక్షిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. నిర్భయ దోషులకు మరణ శిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఉరి శిక్ష ఉత్తర్వులు జారీ కాక పోవడంతో నిర్భయ తల్లి న్యాయస్థానంలో  ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ బాధ, హక్కుల ను పట్టించుకోరాని ఆవేదన చెందారు. దీనికి న్యాయమూర్తి స్పందించారు. ‘మీపై మాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ దోషుల కు హక్కులు ఉంటాయి కదా. మీ వాదనలు మేం తప్పకుండా వింటాం.  చట్టానికి లోబడి వ్యవహరిస్తాం’ అని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos