అలజడి రేపిన నకిలీ ఉచిత స్కూటీ పథకం..

అలజడి రేపిన నకిలీ ఉచిత స్కూటీ పథకం..

 ఉచితంగా ఏదైనా వస్తువులు ఇస్తున్నారంటే సూపర్‌ మార్కెట్‌ల ముందు షాపింగ్‌ మాల్స్‌ ముందు కిలోమీటర్ల మేర బారులు తీరే ప్రస్తుత కాలంలో ఉచితంగా స్కూటీ ఇస్తున్నారంటూ వార్తలు వస్తే ఇక ఆగుతారా.పక్క జిల్లాలకైనా సరే వెళ్లి తెచ్చేసుకోము.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైరల్‌ అయిన వార్త ఒకటి ప్రజలను మీసేవ కేంద్రాల ముందు బారులు తీరేలా చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారనంటూ ఓ ఫేక్‌న్యూస్‌ గంటల్లోనే వైరల్‌గా మారింది.పదవ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 40 ఏళ్ల లోపు మహిళలకు మీసేవా కేంద్రాల్లో స్కూటీలు ఉచితంగా ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది.అందుకు సంబంధించి కొన్ని పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితం కావడంతో ఇదంతా నిజమేనని నమ్మిన లక్షలాది మంది మహిళలు మీ సేవా కేంద్రాల ముందు బారులు తీరారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటిది ఏమీ లేదంటూ ప్రకటన చేసింది. కేంద్రం ఎటువంటి పథకం ప్రకటించలేదని , ఉచిత స్కూటీ పథకం అబద్దపు వార్తలని ఎవరు స్కూటీల కోసం మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా చెప్పింది. సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు గుర్తించే సంస్థ అయినఫ్యాక్ట్ లీసైతం ఇదే విషయాన్ని ప్రకటించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos