హోసూరులో పూల ధరలకు రెక్కలు

హోసూరులో పూల ధరలకు రెక్కలు

హోసూరు : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హోసూరు ప్రాంతంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. హోసూరు ప్రాంతంలో రోజా, జర్బరా, కార్నేషన్, చామంతి తదితర పూల పంటలను ఇక్కడి రైతులు సాగు చేస్తూ,  కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకే కాకుండా  తమిళనాడులోని వివిధ జిల్లాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.  ప్రస్తుతం వినాయక చవితిని పురస్కరించుకుని హోసూరు ప్రాంతంలో పూల ధరలు అంబరాన్నంటుతున్నాయి. వారం రోజుల కిందట కిలో చామంతి ధర రూ.50 కాగా ప్రస్తుతం రూ.2 వందలకు విక్రయిస్తున్నారు.

ముద్దబంతి పూలు కిలో వందకు పైగా అమ్ముడవుతోంది. కేరళకు పూల రవాణా నిలిచిపోవడంతో కాస్త ధరలు తగ్గినా, కనకాంబరం, జర్బరా తదితర పూల రకాలకు గిరాకీ బాగా ఉందని రైతులు తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బొజ్జ గణపయ్య ప్రతిమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, పూల ధరలు కాస్త తగ్గాయని చెబుతున్నారు. వినాయక ప్రతిమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించి ఉంటే ధర మరింత పెరిగేదని వ్యాపారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos