జెకెపిఎం నేత ఫైజల్‌ గృహనిర్బంధం

జెకెపిఎం నేత ఫైజల్‌ గృహనిర్బంధం

న్యూఢిల్లీ:రాజకీయాల్లోకి ప్రవేశించిన ఐఏఎస్ టాపర్ షా ఫైజల్ను శ్రీనగర్లో గృహనిర్బంధంలో ఉంచారు. ఇస్తాంబుల్కు వెళ్లేందుకు
ఇక్కడకు వచ్చిన ఆయన్ను పోలీసులు బుధవారం ఇక్కడి విమానాశ్రయంలో బంధించి శ్రీనగర్ తీసుకెళ్లారు. ఐఏఎస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కశ్మీరీగా గుర్తింపు పొందిన ఫైజల్ గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి జమ్ము-కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ (జెకెపిఎం) పేరిట రాజకీయ పక్షాన్ని ప్రారంభించారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినందకు గత కొన్ని రోజులుగా ఆయన కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. నిన్న కూడా ఓ ట్వీట్ చేశారు. ‘కశ్మీర్లో రాజకీయ హక్కులను పునరుద్ధరించేందుకు ఓ స్థిరమైన, సుదీర్ఘమైన, అహింసతో కూడిన రాజకీయ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 370 రద్దుతో ప్రధాన రాజకీయ నాయకులు తుడిచి పెట్టుకుపోయారు. రాజకీయ వాదులు వెళ్లి పోయారు. అందువల్ల ఇప్పుడు ఒకరి కింద అన్నా బతకాలి లేదా ప్రత్యేకంగా అయినా ఉండాలి’ అని ఫైజల్ మంగళ వారం ట్విటర్లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos