ప్రియాంకా గాంధీపై ఎఫ్​ఐఆర్​

ప్రియాంకా గాంధీపై ఎఫ్​ఐఆర్​

లఖ్నవ్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో సహా పై 11 మందిపై సీతాపుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లఖింపుర్ ఖేరి హింస బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను సీతాపుర్ పోలీసులు నిర్బంధించారు. ఎలాంటి ఉత్తర్వులు, ఎఫ్ఐ ఆర్ లేకుండా 28 గంటల నుంచి తనను బంధించారని మంగళవారం ఉదయమే ప్రియాంక ఆరోపించారు. ప్రియాంకా గాంధీ, దేవింద్ర హుడా, అజయ్ కుమార్ లల్లూపై ఐపీసీ సెక్షన్ 107/16 ప్రకారం కేసు నమోదు చేసినట్లు హరాగావ్ పోలీస్ ఠాణాధికారి బ్రిజేశ్ త్రిపాఠీ తెలిపారు. ప్రియాంకా గాంధీ నిర్బంధం చట్టవిరుద్ధమని, సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం విమర్శించారు. సూర్యోదయానికి ముందు. ఉదయం 4.30 గంటల సమయంలో ఒక పురుష పోలీసు అధికారి ఆమెను అరెస్టు చేసారు. ఇంతవరకు న్యాయస్థానానికి దుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్లో సమన్యాయం లేదని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చట్టం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ‘గళమెత్తుతున్న ప్రజలను హింస, అణచివేతకు ప్రభుత్వం గురిచేస్తోంది. లఖింపుర్ ఖేరీ సంఘటనే ఇందుకు రుజువు అని పీటీఐ ముఖాముఖిలో ప్రియాంక వ్యాఖ్యానించారు. ”ఓ కార్యక్రమం కోసం లఖ్నవూ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. లఖింపుర్ ఖేరీకి ఎందుకు వెళ్లరు. 15 నిమిషాల్లో హెలికాప్టర్లో వెళ్లొచ్చు. దారుణ హత్యకు గురై కుమారులు చనిపోయిన బాధలో ఉన్న కుటుంబాల కన్నీళ్లు తుడవొచ్చు’అని నిలదీశారు. రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెల కొన్నాయని, నిరసనలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా.. టీచర్లు, విద్యార్థులైనా కొట్టి జైలుకు పంపడమే ఈ ప్రభుత్వానికి తెలుసని దుయ్యబట్టారు మంత్రి రాజీనామా చేయాలని, నిందితులకు శిక్ష పడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, తనకూ అదే కావాలని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos