నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు

నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు

హైదరాబాదు : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గడువు ముగిసినా నిర్మాతల మండలికి ఎన్నికలు జరపడం లేదంటూ శనివారం ఉదయం పలువురు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో ఆందోళనకు దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు సి.కల్యాణ్ నియంతృత్వ ధోరణి వల్ల నిర్మాతల మండలిలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా నిర్మాతల మండలిలో సర్వసభ్య సమావేశాలు జరపడం లేదని, సభ్యులకు లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. వెంటనే నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటనికి కూడా దిగుతామని వారు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos