ఏనుగుల సంచారంతో భయం భయం

ఏనుగుల సంచారంతో భయం భయం

హోసూరు : ఇక్కడికి సమీపంలోని గ్రామ ప్రాంతాలలో 13 ఏనుగుల మంద సంచరించడంతో అటవీ ప్రాణతానికి చెందిన గ్రామ ప్రజలు భయాందోళనలు గురౌతున్నారు. రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుండీ హోసూరు సమీపంలోని సానమావు అటవీ ప్రాంతానికి చేరుకున్న 50 ఏనుగుల మంద నుండి విడిపోయిన 30 ఏనుగులు సూలగిరి అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి.తరువాత వేపనపల్లి సమీపంలోని కర్ణాటక ఆటవీప్రాంతానికి వెళ్లిన లు నెల రోజుల తరువాత వెనుదిరిగాయి.కర్ణాటక అటవీ ప్రాంతంలో మేత,నీరు దొరకకపోవడంతో ఈ రోజు 13 ఏనుగుల మంద సూలగిరి సమీపంలోని నీలివంక అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైయ్యాయి.గ్రామ ప్రాంతంలో ఏనుగులు కనబడడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ ప్రాంతాలలో సంచరిస్తున్న ఏనుగులను అటవీశాఖ అధికారులు తరిమివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos