ఎంజాయ్‌ పోస్టులు వేయొద్దు

ఎంజాయ్‌ పోస్టులు వేయొద్దు

ముంబై: ‘చేతనైతే పేదవారిని ఆదుకోండి. అంతేకాని సామాజిక మాధ్యమాల్లో అవసరం లేని పోస్టులు చేయొద్దని బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ (55) మంగళవారం ట్విట్టర్లో నటీ,నటులపై మండి పడ్డారు. తమ ఇంటి పరిసరాల్లో విశాల ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తూ హీరోయిన్లు చేసిన పోస్టుల్ని ఈసడించారు. ‘ప్రస్తుతం ప్రజలంతా కరోనాతో భయపడుతున్నారు.సెలబ్రిటీలకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వర్కౌట్స్ చేస్తున్నారు. లాక్డౌన్లో కూడా సెలబ్రిటీలు అందం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చేతనైతే పేదవారిని ఆదుకోవాలి. అంతేకాని ఇలాంటి అవసరం లేని పోస్టులు చేయొద్ద’ని చీత్కరించారు.

తాజా సమాచారం